YS Sharmila | మొద్దు నిద్ర పోవడమే కేసీఆర్‌కు తెలిసిన పని: షర్మిల

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఊర్లు మునిగినా, ఇండ్లు కూలినా, జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా.. దొర గడీ దాటి బయటకు రాడు, జనాన్ని ఆదుకోడు. వానలు వెలిశాక చుట్టం చూపుగా గాలి మోటార్లో చక్కర్లు కొడతాడు. ఆదుకుంటామని గప్పాలు కొడతాడు. ఇంటికి పది వేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇస్తాడు.

- Advertisement -

వెంటనే ఫామ్ హౌజ్ కొచ్చి మొద్దు నిద్ర పోతాడు. 9 ఏళ్లుగా భారీ వర్షాలకు, అకాల వర్షాలకు, వేల కోట్ల పరిహారం అంటూ చెప్పుడే తప్పా రూపాయి ఇచ్చింది లేదు. కనీసం వరదల్లో కొట్టుకుపోయిన వారి కుటుంబాలను ఆదుకున్నదీ లేదు. ఓట్ల కోసం డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం, వరదల్లో జనాన్ని నిండా ముంచడం.. ఇదే పిట్టల దొర పాలన. వరదల్లో వరంగల్ మునక్కుండా 3ఏళ్ల కింద మాస్టర్ ప్లాన్ అని చెప్పినా ఫైల్ కదల్లేదు.

రూ.250 కోట్లు తక్షణం ఇవ్వండని అడిగినా పైసా ఇవ్వలేదు. వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట అని చెప్పి, ఆ హామీని సైతం గోదాట్లోనే కలిపాడు. ఏడాదిగా గేట్లు మొరాయించినా కడెం ప్రాజెక్టును పట్టించుకున్నది లేదు. ప్రమాదపుటంచులో ఉందని చెప్పినా బాగుచేసిందీ లేదు. పర్యటనకు వెళ్లిన మంత్రులు దేవుడే దిక్కని చెప్తున్న మాటలు.. మీ విజనరీ పాలనకు నిదర్శనం.

ప్రశ్నించే ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం అయితే.. జనాలను వరదల్లో పెట్టి, బురదలో నెట్టి మీరు చేసేదాన్ని ఏమనాలి దొర? కనీసం ఎన్నికల ముందైనా వర్షాలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోండి. చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వండి. కూలిన ఇండ్ల స్థానంలో పక్కా ఇండ్లు కట్టించాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.’’ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.

Read Also: హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ చేస్తామని ఖల్లాస్ చేశారు: అరుణ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...