బిగ్ బ్రేకింగ్: రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలింగ్‌కు రెండు రోజులు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రైతులకు ‘రైతుబంధు(Rythu Bandhu)’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఎన్నికల ప్రచారంలో ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రకటన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని.. అందుకే రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వచ్చాక రైతు రుణమాఫీ అమలు, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధు(Rythu Bandhu)కు ఎన్నికల సంఘం అనుమతి కోసం ప్రభుత్వం లేఖలు రాసింది. అయితే ఎన్నికలకు ఐదు రోజుల ముందు రైతుబంధు పథకం అమలుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 28వ తేదీ కల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవచ్చునని తెలిపింది. 2018 అక్టోబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని సూచించింది. అయితే ఎన్నికల ప్రచారాల్లో మంత్రి హరీశ్ రావు నిబంధనలు ఉల్లఘించారని పేర్కొంటూ రైతుబంధు నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం నిలిచిపోనుంది.

Read Also: శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...