బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది. అదేరోజు కవిత ఢిల్లీలో ధర్నా తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కవితకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్‌ను ఈడీ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో అతన్ని హాజరు పరిచిన అధికారులు రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. ఇందులో కవిత పేరును పదేపదే ప్రస్తావించిన అధికారులు.. సౌత్ గ్రూప్ తరపున ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రతినిధిగా అరుణ్ వ్యవహరించినట్లు తెలిపారు. అతన్ని మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈడీ అధికారులు కవితకు నోటీస్‌లు ఇవ్వటం, పిళ్లయ్‌తో కలిసి విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది.
Read Also: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్
Follow us on: Google News