ED IT raids: హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈడీ, ఐటీ దాడులు

-

ED IT raids at Hyderabad and Karimnagar: హైదరాబాద్‌, కరీంనగర్‌లో గ్రానైట్‌ మైనింగ్‌ అక్రమాలపై ఈడీ, ఐటీ కొరడా ఝలపించింది. మైనింగ్‌ అక్రమాలపై ఈడీ, ఐటీ అధికారులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌, కరీనంగర్‌లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు(ED IT raids)  చేపట్టారు. ఈ రెండు చోట్లలో 30 ప్రాంతాల్లో 30 టీమ్స్‌తో దాడులు నిర్వహిస్తున్నారు. కాగా, కరీంనగర్‌లో గ్రానైట్‌ అక్రమాలపై బీజేపీ నేత పేరాల శేఖర్‌ రావు ఫిర్యాదు మేరకు సీబీఐ, విశాఖ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్‌ గ్రానైట్‌ విదేశాలకు ఎగుమతి జరుగుతుండగా.. అక్రమంగా గ్రానైట్‌ తరలిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై 2011లో కాకినాడ పోర్టులో అధికారులు సోదాలు నిర్వహించారు. వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అక్రమంగా గ్రానైట్‌ తరలిపోతుందని గుర్తించిన అధికారులు.. అక్రమ ఎగుమతులపై పలు సంస్థలకు నోటీసులు ఇచ్చి భారీ స్థాయిలో జరిమానాలు విధించారు. అయితే ఇప్పుడు తాజాగా కరీంనగర్‌ మైనింగ్‌ అక్రమాలపై దృష్టి పెట్టిన ఈడీ, సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సోదాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...