హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు(ED Raids) కలకలం రేపాయి. శనివారం ఉదయం ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, మాదాపూర్‌లోని ఫార్మా కంపెనీ ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు జువెన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100 కు పైగా కంపెనీలపై రైడ్(ED Raids) చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు అధికారులు.. రద్దయిన ఫార్మా కంపెనీల లిస్ట్‌లో హైదరాబాద్‌కి చెందిన ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. ఔషధాల తయారీలో జరుగుతున్న అతిపెద్ద మోసాన్ని కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. నకిలీ, నాసిరకం ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీలపై కొరడా ఝుళిపించింపింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మొత్తం వందకుపైగా కంపెనీలపై ఇటీవలే తనిఖీలు చేపట్టింది.
Read Also: కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య బంధం బయటపడింది: తరుణ్ చుగ్
Follow us on: Google News, Koo, Twitter