వచ్చే ఏడాది జరగనున్న సార్వ్రతిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నారు. ఇప్పటికే మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ పోలింగ్ ముగిసిన వెంటనే ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. గతంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఉండే నిబంధనను ప్రస్తుతం సవరించింది.
తెలంగాణలో పోలింగ్ 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవచ్చు. అంటే సాయంత్రం 6 గంటలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. అయితే ఈసీ తాజా సూచనల మేరకు సాయంత్రం 5:30 గంటలకే రిలీజ్ చేసుకోవచ్చు. అంటే తెలంగాణలో పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవచ్చు. ఈ పోల్స్‌తో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాల వివరాలు తెలుసుకోవచ్చు.