Errabelli Dayakar Rao | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఎర్రబెల్లి.. రేవంత్ రెడ్డి(Revanth Reddy), బండి సంజయ్‌పై ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో రెండు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి.. ఒకటి రేవంత్ రెడ్డి, మరొకరు బండి సంజయ్(Bandi Sanjay) అంటూ సీరియస్ అయ్యారు. ఈ రెండు పిచ్చి కుక్కలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి రూ.500 కోట్లతో ఇళ్ళు ఎలా కట్టాడు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్ళంతా జైలుకు వెళ్ళివచ్చినవారేనంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నవాళ్ళు భూ కబ్జాదారులు, బ్లాక్ మెయిలర్లని అన్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పూర్తిగా మునిగిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బంపర్ మెజార్టీతో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.