IPL: మైదానంలో నకిలీ టిక్కెట్లు.. నకిలీ సెక్యూరిటీ కార్డులు

-

హైదరాబాద్‌(Hyderabad )లోని ఉప్పల్ మైదానంలో నకిలీ మ్యాచ్ టికెట్లు(Fake IPL Tickets), నకిటీ సెక్యూరిటీ గార్డులు హల్‌చల్ చేశారు. ఈ వ్యవహారంపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసిన రాచకొండ పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేటీఎం తరపున టికెట్లను విక్రయిస్తున్న ఇఫోనీ ఈవెంట్ ఆర్గనైజేషన్ నుంచి నకిలీ టిక్కెట్లు బయటకు వచ్చినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

లా చదువుతున్న ఓ విద్యార్థి ఈ మ్యాచ్‌కు సంబంధించి 5,500 చెల్లించి ఆరు టిక్కెట్లు కొన్నాడు. స్నేహితులతో కలిసి మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్లాడు. అయితే, అప్పటికే వారికి కేటాయించిన సీట్లలో వేరేవాళ్లు కూర్చుని ఉన్నారు. దాంతో సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపగా కొంతమంది నకిలీ టికెట్ల(Fake IPL Tickets)తో స్టేడియం లోపలికి వచ్చినట్టు వెళ్లడయ్యింది. దాంతో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: WTC final 2023 |భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...