తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతోందని, రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ ఎకరానికి రూ. 10 వేల ఆదుకున్నారని గుర్తుచేశారు. కేంద్రం కూడా రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలని, అప్పుడే రైతుల పొలాల్లోకి అడుగుపెట్టి పరామర్శించాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేసీఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడు, నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం, ఎకరాకు 10 వేల సహాయంతో రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
Read Also: నీరా కేఫ్‌కు భారీ డిమాండ్.. తాగేందుకు క్యూ కట్టిన జనం
Follow us on: Google News, Koo, Twitter