Father kills Daughter: కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి

-

Father kills Daughter: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కూతురు పాలిట కాలయముడయ్యాడు. ఎంత చెప్పిన వినకుండా ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉంటుందని కన్నబిడ్డను అనంతలోకాలకు పంపేశాడు ఓ కసాయి తండ్రి. 15 ఎళ్లు కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తెను తన మాట వినలేదన్న కోపంతో క్షణికావేశంలో గొడ్డలితో ఏకంగా ఎనిమిది సార్లు నరికేశాడు. దీంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, పాత పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాజశేఖర్-సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు గీత (15) పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడుతో కుమార్తె సన్నిహితంగా మెలగడాన్ని చూసిన రాజశేఖర్ కుమార్తెను పలుమార్లు హెచ్చరించాడు.

- Advertisement -

ఈ క్రమంలో మంగళవారం కుమార్తె (Daughter) గీతకు మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని కుమార్తె మెడ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గీత రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రాజశేఖర్ నేరుగా పోలీస్ స్టేషన్‍కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...