Fifth edition of the Uniform And Garments Manufacturers Fair 2022 Hyderabad: హైటెక్స్‌లో ప్రారంభమైన ఐదవ ఎడిషన్ యూనిఫార్మ్ మరియు గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ ఫెయిర్ 2022
తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వద్ద డిసెంబర్ 07 నుంచి 09 వరకూ ఈ ఫెయిర్ జరుగనుంది. సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మరియు మహవీర్ టెక్స్‌టైల్ గ్రూప్, సోలాపూర్‌లు సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నాయి
దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్ మహమ్మారి తీసుకువచ్చిన విరామం తరువాత 5వ ఎడిషన్ యునిఫార్మ్ అండ్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ ఫెయిర్ 2022 మరోమారు తిరిగి వచ్చింది. సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్‌జీఎంఏ) నిర్వహిస్తున్న ఈ ఫెయిర్‌ను డిసెంబర్ 07వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు హైటెక్స్‌లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర పూర్వ టెక్స్‌టైల్స్ శాఖామాత్యులు, ఎంఎల్‌ఏ శ్రీ సుభాష్ దేశ్‌ముఖ్, ట్రేడ్ కౌన్సిలర్, కెన్యా హై కమిషన్ శ్రీ జరేడ్ మావియేకా, మహారాష్ట్ర టెక్స్‌టైల్స్ డైరెక్టర్ శ్రీ పి శివశంకర్, ఎంఎస్‌ఎంఈ, అదనపు డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీ డి చంద్రశేఖర్, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ శ్రీ అశోక్ గోఖే, మహావీర్ టెక్స్‌టైల్స్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ ప్రకాష్ దకాలియా, శ్రీ సోలాపూర్ రెడీమేడ్ కపాడ్ ఉత్పాదక్ సంఘ్ (ఎస్‌ఎస్‌ఆర్‌కెయుఎస్) అధ్యక్షుడు శ్రీ నీలేష్ షాలతో పాటుగా ఉగాండా, కెన్యా, కజికిస్తాన్ సహా ఐదు దేశాల హై కమిషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ ఫెయిర్‌ను ప్రారంభించిన అనంతరం మహారాష్ట్ర పూర్వ టెక్స్‌టైల్స్ శాఖామాత్యులు , ఎంఎల్‌ఏ శ్రీ సుభాష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ‘‘యూనిఫార్మ్ గార్మెంట్ తయారీదారులు, యూనిఫార్మ్ ఫ్యాబ్రిక్ తయారీదారులు, యూనిఫార్మ్ యాక్ససరీల తయారీదారులు ఈ షోలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం దేశంలో దీనిని సమాంతరంగా లభ్యమవుతున్న మరో వేదిక ఉన్నట్లుగా నాకు తెలియదు. సోలాపూర్ గార్మెంట్ అసొసియేషన్ ను అభినందిస్తున్నాను. దేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా ఇది యూనిఫార్మ్స్‌కు సంబంధించి అతి పెద్ద వేదికగా ఇది నిలుస్తుంది’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ దేశం నుంచి మాత్రమే గాక ప్రపంచవ్యాప్తంగా తయారీదారులు ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నారని తెలిసి సంతోషిస్తున్నానన్నారు.
సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ గత ఆరు సంవత్సరాలుగా ఇండియాను యూనిఫార్మ్ సోర్సింగ్ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సుప్రసిద్ధ తయారీదారులు, డీలర్లు, హోల్‌సేలర్లు ఈ ఫెయిర్‌లో పాలుపంచుకుంటున్నారు. వీరిలో మఫత్‌లాల్, ఎస్ కుమార్, ఓమ్యాక్స్, స్పార్ష్, శుభాటెక్స్, గంగోత్రి, సంగం, వంటివి ఉన్నాయి.
‘‘యునిఫార్మ్స్, ఫ్యాన్సీ గార్మెంట్స్, యునిఫార్మ్ ఫ్యాబ్రిక్ తయారీదారులు తమ ఉత్పత్తులను మొట్టమొదటిసారిగా తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఒకే చోట ప్రదర్శించనున్నారు. మహారాష్ట్రకు వెలుపల ఈ ఫెయిర్ నిర్వహిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని విజయ్ దకాలియా, డైరెక్టర్, సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అన్నారు.
మహారాష్ట్ర టె క్స్‌టైల్స్ డైరెక్టర్ శ్రీ పి శివశంకర్ మాట్లాడుతూ ‘‘ఈ సంవత్సరం బీ2బీ ఏరీనాను ప్రత్యేకంగా సందర్శక కొనుగోలుదారుల ప్రయోజనార్ధం ఏర్పాటుచేశాము. అలాగే సుప్రసిద్ధ మిల్స్ చేత నాణ్యత పట్ల ఎగ్జిబిటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులనూ ఏర్పాటుచేశాము’’ అని అన్నారు.