Fire Accident : హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్ అగ్ని ప్రమాదం

-

Fire Accident at janapriya apartment in Hyderabad: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అగ్ని ప్రమదం చోటు చేసుకుంది. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని నాలుగవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ ఫ్లాట్‌‌లో మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. కాగా.. ప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాక్ సర్క్యూట్‌‌‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...