హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల ధాటికి ఆసుపత్రి లోపల ఉన్న రోగులు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.