Flexes In Secunderabad |ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందురోజు బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నయా ప్లాన్ వేసింది. శుక్రవారం వందేభారత్ రైలును ప్రారంభించేందుకు రాష్ట్రానికి మోడీ వస్తున్న నేపథ్యంలో బీజేపీలోని నేతలు-వారసులతో కూడిన భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. గతానికి భిన్నంగా భారీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు అమిత్ షా, పియూష్ గోయల్, రాజ్ నాథ్ సింగ్‌లతోపాటు పలురాష్ట్రాలకు చెందిన సీఎంలు వారి వారసులు, గౌతం అదానీ, ముకేష్ అంబానీ వారసులను సైతం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అని విమర్శిస్తున్న కౌంటర్లకు బీజేపీ సైతం కుటుంబ పాలన సాగిస్తుందని ప్రతిగా కౌంటర్‌గా ప్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: ప్రధాని మోడీపై యూపీ సీఎం ప్రశంసల జల్లు
Follow us on: Google News, Koo, Twitter