TSPSC Chairman | టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

-

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌(TSPSC Chairman)గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahendar Reddy) నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలుకు గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే ఆయన TSPSC ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి ఎంపిక ఖరారైన నేపథ్యంలో ఇక సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పోటీ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది.

- Advertisement -

ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైన నేపథ్యంలో ఇక సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పోటీ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ దరఖాస్తులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించింది. చివరకు మాజీ డీజీపీ వైపే మొగ్గు చూపింది.

తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డి వరంగల్ ఎన్ఐటిలో సివిల్ ఇంజినీరింగ్.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. గోదావరిఖని ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించగా.. 2017 నుంచి 2022 వరకు తెలంగాణ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.

Read Also:  వైఎస్ కుటుంబం చీలడానికి కారణం జగన్‌.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...