Telangana Assembly | తెలంగాణ శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR).. ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. తెలంగాణ స్పీకర్‌గా ఎన్నికైన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ చరిత్ర సృష్టించారు. కాగా బుధవారం సాయంత్రం ముగిసిన స్పీకర్ ఎన్నిక నామినేషన్లలో గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
Telangana Assembly | అంతకుముందు శాసనసభ మొదలైన వెంటనే గతంలో ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇతర శాసనసభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.