ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని ప్రముఖ సింగర్ గద్దర్(Gaddar) నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల కమిషన్‌తో గద్దర్ భేటీ అయి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ‘గద్దర్ ప్రజా పార్టీ(Gaddar Praja Party)’ పేరును ఖరారు చేశారు. పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలిని పెట్టారని సమాచారం. ఈ మూడు రంగుల్లో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతో ప్రారంభించారు. గద్దర్ మొదటగా అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా ఆయన వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. అందుకే నీలి రంగు కూడా జెండాలో తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో గద్దర్(Gaddar) ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆ మధ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, నిరుద్యోగ సమస్య, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల తీరు, ధరణి పోర్టల్ వల్ల ప్రజలు పడుతున్న బాధలను.. ‘నన్ను గన్న తల్లుల్లారా’ అనే బాణిలో వివరిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు. గద్దర్ పార్టీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also:
1. వ్యవస్థలో లోపాలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
2. ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat