ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న గద్దర్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో తుపాకీతోనే రాజ్యాధికారం వస్తుందని పోరాటాలు చేశారని, కానీ, నేడు ఆ పరిస్థితి లేదని అంబేద్కర్(Ambedkar) కల్పించిన గొప్ప ఆయుధమైన ఓటు హక్కును సరిగా ఉపయోగించుకుంటే చాలని అన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్(KCR) రాచరిక పాలను వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం బడుగు బలహీన వర్గాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గత తొమ్మిది ఏళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. ముఖ్యంగా దళితులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. అంతేగాక, భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని అభిప్రాయపడ్డారు. పేదలను నట్టేట ముంచుతూ దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులను దోచిపెడుతోందని గద్దర్(Gaddar) మండిపడ్డారు.
Read Also: టార్గెట్ బీజేపీ.. త్వరలో విపక్షాల భారీ సమావేశం
Follow us on: Google News, Koo, Twitter