మొన్న హైదరాబాద్.. నేడు మెదక్.. రెచ్చిపోతున్న కుక్కలు

-

Girl attacked by Stray Dogs| తెలంగాణలో వీధి కుక్కల దాడులు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒకచోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఓ బాలికపై కుక్కలు దాడికి దిగాయి. ఇంటి బయట ఉన్న పాపపై ఒక్కసారిగా కుక్కలు మెరుపు దాడి చేశాయి. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కుక్కలను అదిలించడంతో పారిపోయాయి. అయితే ఈ దాడిలో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం పాపను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలికపై కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...