గవర్నర్ పదవికి రాజీనామా చేసి తూత్తుకుడి(Thoothukudi) ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Governor Tamilisai) స్పష్టంచేశారు. గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమిన.. తాను తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గానే కొనసాగుతానని తెలిపారు. అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని పేర్కొన్నారు. తాను అసలు ఢిల్లీనే వెళ్లలేదని.. ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు. రాములోరి ఆశీస్సులతో పాటు ప్రధాని మోదీ దయతో తాను అప్పగించిన విధులను నిర్వహిస్తున్నానని వివరించారు. అయోధ్య రామాలయ ద్వారాలు తయారుచేసిన సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోను తమిళిసై సందర్శించి పైవిధంగా స్పందించారు.
కాగా ఆమె(Governor Tamilisai) తమిళనాడులోని తూత్తుకుడి సీటు నుంచి ఎంపీగా తిరిగి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అధిష్టానం అంగీకరిస్తే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల నుంచి తప్పుకుని పోటీ చేస్తానని ఆమె తెలిపినట్లు ఊహాగానాలు వచ్చాయి.