Ayodhya | అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

-

అయోధ్య(Ayodhya)లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సం కోసం అయోధ్య వచ్చిన మోదీ 15 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా అభిమానులు పూల వర్షం కురిపించారు. అలాగే దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

- Advertisement -

రోడ్‌ షో ముగిసిన తర్వాత ఇటీవల పునర్ నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌(Ayodhya Dham Railway Satation)ను ప్రారంభించారు. రైల్వేస్టేషన్ రెనోవేషన్‌ కోసం ప్రభుత్వం రూ.240కోట్లు ఖర్చు చేసింది. రామ మందిర ఆకృతిలోనే స్టేషన్‌ని తీర్చి దిద్దడం విశేషం. అనంతరం కొత్తగా నిర్మించిన రెండు అమృత భారత్ రైళ్లతో పాటు ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా ఊపారు. వందేభారత్ రైలు ఎక్కి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తదుపరి మహార్షి వాల్మీకి విమానాశ్రయాన్ని(Maharshi Valmiki Airport) కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి కూడా పాల్లొన్నారు.

Read Also:  వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...