తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన గ్రూప్-1 పరీక్ష

-

Group 1 Exam | తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 994 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగుతోంది. ఉదయం 8:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఉదయం 10:15 గంటలకే అన్ని పరీక్షా కేంద్రాల గేట్లు మూసేసిన అధికారులు.. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు చేసేదేంలేక ఆవేదనతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలోనూ ఈ పరీక్ష నిర్వహించినప్పటికీ పేపర్ లీక్ కారణంగా తాజాగా మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతోపాటు ఇన్విజిలేటర్లు కూడా కేంద్రాల్లోకి ఫోన్ తీసుకువెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

Read Also:
1. మంత్రి రోజాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...