Gun Firing |కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం

-

Gun Firing |తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కరీనంగర్ జిల్లా మానకొండూరులో బుధవారం అర్థరాత్రి నాలుగు రౌడీషీటర్లు బీభత్సం సృష్టించారు. అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతనని చితకబాదారు. పారిపోతున్న క్రమంలో తుపాకీతో కాల్చారు. అయితే ఆ బుల్లెట్ తగలకపోవడంతో ఆయన పక్కనే ఉన్న ఓ ఇంట్లో దాక్కున్నాడు. అయినా కానీ ఆ దుండగులు ఆ ఇంట్లోకి ప్రవేశించి వారింట్లోని సామాన్లు ధ్వంసం చేసి వారిని బెదిరించారు.

- Advertisement -

స్థానికులు అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరిని పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు పారిపోయారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని తప్పించుకున్న ఆ ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. అరుణ్‌ తో ఉన్న పాత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. అర్థరాత్రి పూట కాల్పులు(Gun Firing) జరగడంతో మానుకొండూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Read Also: భాగ్యనగరంలో ఈ ప్రాంతాల్లోనే డబుల్ డెక్కర్ బస్సుల ప్రయాణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...