Gun Misfire at police station in Komuram Bhim district: గన్ మిస్ ఫైర్ అయ్యి కానిస్టేబుల్ తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన కొమురం భీం జిల్లాలో జరిగింది. కౌటాల పోలీస్ స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే.. సెట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. బులెట్ లోతుగా చొచ్చుకుపోవటంతో.. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న బాధిత కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు, ఆసుపత్రి బెడ్‌పై రక్తగాయాలతో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. గన్ మిస్ ఫైర్ అయ్యిందా, లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.