Guns Seized in Singitham Village Kamareddy District: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. గంజాయి నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో సంగీతం గ్రామానికి చెందిన సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదా చేస్తుండగా.. రెండు నాటు తుపాకులు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేయటంతో పాటు.. జంతువులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు.. నిందితుడిని బాన్సువాడ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కార్డెన్ సెర్చ్ ముమ్మరం చేయటంతో, అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. అయినప్పటికీ పోలీసుల కళ్లగప్పి.. నిందితులు అక్రమాలకు ఒడగడుతూనే ఉంటారు. తాజాగా ఈ నాటు తుపాకులు బయటపడటంతో.. పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.