గురుకుల పీఈటీ(Gurukula PET) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కార్యాలయం ముట్టడికి పీఈటీ అభ్యర్థులు యత్నించారు. ముట్టడికి సంబంధించిన వివరాలను ముందుగానే వెల్లడించారు. దీంతో గురువారం ఉదయం నుంచి టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం ఒక్కసారిగా గాంధీభవన్ నుంచి అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. 2017లో 616 పోస్టులుతో విడుదల అయినా నోటిఫికేషన్‌లో పరీక్ష రాసి 1232 మందిని ఎంపిక చేశారని మధ్యలో కోర్ట్ కేసులతో వాయిదా వేస్తూ ఆరు సంవత్సరాలు కాలయాపన చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కోర్టు కేసు పూర్తి అయినప్పటికీ టీఎస్పీఎస్సీ(TSPSC) స్పందించటం లేదని అభ్యర్థులు వాపోయారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి, అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
Read Also:
1. పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందే.. రేవంత్ పిలుపు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat