ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి(Gutha Sukender Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణలో సాధ్యం కాని హామీలిస్తుందని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే బీజేపీ(BJP) బలోపేతానికి కారణమని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. నాలుగు వేల పెన్షన్‌ను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
దేశ బడ్జెట్ సగం ఇచ్చినా కాంగ్రెస్ హామీలు సాధ్యంకాదన్నారు. బీజేపీని కేంద్రంలో గద్దె దింపేందుకు కాంగ్రెస్ సమ్మతంగా లేదని వివరించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలోనే ఖమ్మం సభలో కాంగ్రెస్(Congress) కుమ్ములాటలు బయటపడ్డాయని అన్నారు. బీజేపీ అరాచక మతతత్వ రాజకీయాలకు పూనుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ వ్యతిరేక శక్తులు కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని గుత్తా (Gutha Sukender Reddy) వెల్లడించారు.
Read Also:
1. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఔట్.. ఈటలకు కీలక పదవి
2. తెలంగాణకు భారీ పెట్టుబడి.. కేటీఆర్‌తో భేటీ అనంతరం ప్రకటన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat