Gutti Koyas: గుత్తికోయలకు రాష్ట్రంలో ఎలాంటి హక్కులూ లేవు :మంత్రి సత్యవతీ రాథోడ్‌

-

Gutti Koyas are not eligible for any forest rights in telangana minister satyavathi rathod: గుత్తికోయలకు రాష్ట్రంలో ఎలాంటి హక్కులూ లేవని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతీ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గుత్తికోయలు తెలంగాణ రాష్ట్ర గిరిజనులు కాదనీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు వారు అర్హులు కాదన్నారు. అందువల్ల గుత్తికోయలకు పోడు భూముల పట్టాలు, రిజర్వేషన్లూ వర్తించవని తెలిపారు. కాగా.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఛత్తీస్‌‌ఘఢ్ నుంచి వచ్చిన గొత్తికోయల(Gutti Koyas)కు ఇక్కడ ఎలాంటి హక్కు లేదనే విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయినట్టు ఉన్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని రేవంత్ ఆరోపించడం సరికాదన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతోనే కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్​ రేంజ్​ అధికారి శ్రీనివాస్ గుత్తికోయల చేతిలో హత్యకు గురైయ్యారని రేవంత్‌ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...