తెలంగాణ రాజకీయాలు పేపర్ లీకులు చుట్టూ తిరుగుతున్నాయి. టెన్త్ హిందీ పేపర్ లీకు కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) హస్తం ఉందంటూ ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సంజయ్ అరెస్ట్ పై మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. పదో తరగతి పేపర్ లీకుల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. కుట్ర వెనునక బండి సంజయ్ మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు. మీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టెన్త్ తెలుగు పేపర్, హిందీ పేపర్ లీకులకు పాల్పడింది బీజేపీ కార్యకర్తలేనని చెప్పారు. తాండూరులో తెలుగు పశ్నాపత్రం వాట్సాప్ లో లీక్ చేసిన ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘం నేత అన్నారు. అలాగే వరంగల్ లో హిందీ పేపర్ లీక్ కు ప్రయత్నించిన ప్రశాంత్.. బండి సంజయ్ అనుచరుడు అని తెలిపారు. లీకులతో విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. చదువుపై దృష్టిపెట్టి పరీక్షలు బాగా రాయాలని హరీశ్(Harish Rao) సూచించారు.
Read Also: ఎవరినీ వదిలిపెట్టం.. హిందీ పేపర్ లీక్‌పై సీపీ రంగనాథ్ సీరియస్
Follow us on: Google News, Koo, Twitter