సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను(KCR) ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని విమర్శించారు. గోబెల్స్ అబద్ధాలు ఆడటం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్యలా మారిందని, ప్రతి విషయంలో కూడా ఆయన అబద్దాలే చెప్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన శనివారం జరిగిన అసెంబ్లీలో మార్చేశారని, అన్నారు. కేసీఆర్.. తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపారని, దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారిన పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని(Jana Reddy) కేసీఆర్ ఎంతో గౌరవించారని గుర్తు చేశారు.
‘‘సీఎం రేవంత్(Revanth Reddy) వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కేసీఆర్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలకుగానూ రేవంత్ క్షమాపణలు చెప్పితీరాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించింది. గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పిన కాంగ్రెస్ నేతలు తీరా అధికారం వచ్చిన తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారు’’ అని విమర్శించారు హరీష్ రావు(Harish Rao).