కుల వృత్తులను తెలంగాణ రాష్ట్రంలో ప్రొత్సాహించినట్లు మరే రాష్ట్రంలో ప్రొత్సాహించడం లేదని హరీష్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకునేలా సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఆలోచిస్తారని అన్నారు. ఆదివారం సిద్దిపేటలో కుల వృత్తుల ప్రొత్సాహం కోసం రూ. లక్ష గ్రాంట్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. గతంలో రుణాల కోసం షూరిటీ కావాలని తిరిగి తిరిగి చెప్పులరిగేవని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు ప్రజలకు అందించేలా సీఎం కేసీఆర్(KCR) ఆలోచన చేశారని మంత్రి తెలిపారు.
అన్నీ వర్గాల ప్రజలను అన్నీ విధాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని తెలిపారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వరకే రజకులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
గీతా కార్మికులకు లైసెన్స్ ఆటో రెన్యువల్ సిస్టం తీసుకొచ్చామని, అలాగే వైన్స్‌లో రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 300 బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ వచ్చాయని, వారం రోజుల్లో సిద్ధిపేటకు డిగ్రీ బీసీ రెసిడెన్షియల్ తీసుకరాబోతున్నట్టు మంత్రి ప్రకటించారు.