కాంగ్రెస్ ఎంపీకి హరీష్ రావు వార్నింగ్..

-

కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మధ్య మాటల యుద్ధం మొదలైంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులకు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అండగా నిలవడంపై అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపై ఈరోజు స్పందించిన హరీష్ రావు.. తనకు అనిల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ‘ప్రజా సమస్యల పై పోరాడుతున్న నాపై బురదజల్లే వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నారు.

- Advertisement -

ఇంతే వదిలేస్తే గోల్కొండ కోట, చార్మినార్ లో కూడా హరీష్ రావు కు వాటాలు ఉన్నాయి అని అంటారేమో? అబద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అనిల్ కుమార్‌ యాదవ్‌ను హెచ్చరిస్తున్నా’’ అని హరీష్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన అనిల్.. ‘‘హరీష్ రావు.. మీ ట్వీట్ చూశాను. మాది గోబెల్స్ ప్రచారం అంటున్నారే కానీ.. ఇంతకీ FTL భూముల్లో మీకు వాటా ఉందో? లేదో ? చెప్పలేదు. ఇంతలా దాస్తున్నారు అంటే.. నిప్పు లేనిదే పొగ రాదు అనుకోవాలా?’’ అంటూ అనిల్ కుమార్ మరో పోస్ట్ పెట్టారు.

అసలు అనిల్ కుమార్ ఏమన్నారంటే..

మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ నేతలు మద్దతు పలకడంపై అనిల్ కుమార్ కీలక ఆరోపణలు చేశారు. ‘‘మూసీ పర్యటన, హైడ్రా సమావేశాల పేరుతో అగ్గిపెట్టె హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి చేస్తున్న రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా? హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు వాటాలు ఉన్నాయి. తను అక్రమంగా నిర్మించిన వందల కోట్ల విలువ గల ఆనంద కన్వెన్షన్ ను కాపాడుకునేందుకు హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారు.

నువ్వు అక్రమంగా సంపాదించిన వందల కోట్ల విలువైన ఆస్తులను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలను అడ్డుపెట్టుకుంటున్న అగ్గిపెట్టె హరీష్ రావు(Harish Rao) ఖబర్దార్… ఎవరెన్ని కుట్రలు చేసినా చెరువులు, నాలా భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత ఆగదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. చెరువులు, నాలాలు, మూసీ నది పరివాహక ప్రాంతాలను కాపాడి భవిష్యత్ తరాలకు భరోసా అందించేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మద్దతుగా నిలుస్తోంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

Read Also: కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...