తెలంగాణ శాసనసభ(Telangana Assembly)లో అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యుత్ రంగం శ్వేతపత్రంలో అప్పులపై వివరాలు ఇచ్చారు కానీ హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పలేదని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌కు నిధులు ఎలా తెస్తారు? అని నిలదీశారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణలో 24 గంటల కరెంట్ వచ్చిందని ఒవైసీ తెలిపారు.
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనాయణ కలుగజేసుకుని మీరు భాగస్వామ్యంగా ఉన్న బీఆర్ఎస్ పాలనలో అప్పులతో పాటు పాతబస్తీలో అభివృద్ధిపై మాట్లాడాలని కోరారు. దీంతో సభలోకి కొత్తగా వచ్చిన సభ్యులు కూడా మాట్లాడుతున్నారని అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
Telangana Assembly | ఈ క్రమంలో రేవంత్ రెడ్డి.. ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఆరెస్సెస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. తాను మజ్లిస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుతానన్నారు. నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇలా అందరితో దోస్తీ చేశారని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చర్చిద్దామంటే సిద్ధమని మండిపడ్డారు.