Telangana Assembly | అసెంబ్లీలో సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య వాడివేడి చర్చ

-

Telangana Assembly |తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌కు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాడివేడి చర్చ జరిగింది. గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి బలపరిచారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR) మాట్లాడుతూ గవర్నర్‌ ప్రసంగమంతా అసత్యంగా, తప్పుల తడకగా, ఉందని ఆరోపించారు. మధ్యలో కల్పించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar).. 2014కు ముందు అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. ప్రసంగం మొదలు పెట్టడమే కేటీఆర్‌ దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదని.. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. . లక్షకోట్ల రూపాయలు వృథా చేశారని, పదేళ్లపాటు విధ్వంసం చేశారని భట్టి మండిపడ్డారు. తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు.

- Advertisement -

అనంతరం కేటీఆర్ ప్రసంగం కొనసాగిస్తూ గత 10 ఏళ్ల పాలన గుర్తుచేస్తున్న వారికి అంతకు ముందు 55 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చెప్పాలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం జరిగిన అరాచకాలను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. శ్రీశ్రీ చెప్పినట్టు బానిసకొక బానిస అన్నట్టు తెలంగాణను పీడించిన వాళ్లు పోయినా వారిని తలుచుకునే వాళ్లు మాత్రం ఇక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము 39 మంది, వాళ్లు 65 మంది ఉన్నారని మిడిసి పడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. వాళ్లకు తమకు మధ్య తేడా 1.85 ఓటు మాత్రమే అన్నారు. దీనికే ఈ మాత్రం మిడిసిపాటు వద్దని పేర్కొన్నారు.

Telangana Assembly |కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం అవగాహన కాదు అని ఎద్దేవా చేశారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని పేర్కొన్నారు. ఆ స్పిరిట్‌ను తీసుకోకుండా వాళ్లు 65 మంది ఉన్నారు… మేము 39 మంది ఉన్నాం మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు వచ్చిన కొట్లాడతామంటే ఇక్కడ కుదరదన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌(KCR)కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన హరీశ్‌రావు(Harish Rao)ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిందని కాంగ్రెస్ పార్టీ అన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో కొట్లాడింది పీజేఆర్ మాత్రమే అన్నారు.

అనంతరం హరీశ్ రావు కలుగజేసుకుని సీఎం రేవంత్‌ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని తెలిపారు. అప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని తాము కొట్లాడామని.. అప్పట్లో ఒక్క పీజేఆర్‌ తప్ప మంత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఎవరూ పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేదన్నారు. తాము పొత్తు పెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆ రోజు భిక్ష పెట్టింది తామేనని, తమతో పొత్తుపెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

Read Also: టాలీవుడ్ ప్రెస్ మీట్లకు బ్యాన్ చేయడంపై స్పందించిన సురేష్ కొండేటి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...