Hyderabad |హైదరాబాద్‌లో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడు భగ భగ మండగా.. సాయంత్రం భారీ వర్షం మొదలైంది. అబ్జల్ గంజ్, అబిడ్స్, సైదాబాద్, బండ్లగూడ, హిమాయత్ నగర్, ఎల్బీనగర్, నాంపల్లి, చార్మినార్, బాలాపూర్, యాకత్పుర, చాంద్రాయణగుట్ట, సరూర్ నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. సిటీలోని మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. అయితే, కొద్దిరోజులుగా ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న సిటీ ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.