తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు చెప్పింది. గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నేత, డీకే అరుణ(DK Aruna)ను ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ, అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించాడని గతంలో డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan Reddy) ఎన్నిక చెల్లదంటూ తీర్పు నిచ్చింది. కాగా, ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు తప్పుడు అఫిడవిట్లు సమర్పించాడని వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టు వేటు వేయడంతో స్థానిక నేతలు ఖంగుతిన్నారు.