Gaddar Statue | దివంగత ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి HMDA ఆమోదం తెలిపింది. దీంతో విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31న గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాం నిర్వహించాల్సి ఉంది. అయితే విగ్రహం ఏర్పాటుచేస్తున్న స్థలం HMDA పరిధిలోకి వస్తుందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు గద్దర్ విగ్రహావిష్కరణను అడ్డుకోవడంతో కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) జోక్యం చేసుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లభించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా గద్దర్ విగ్రహం(Gaddar Statue) ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంపై ప్రజా సంఘాలు హర్షం చేస్తున్నాయి.