TS High Court | ప్రొఫెసర్ కోదండరామ్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్

-

TS High Court | గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌(Mir Amir Ali Khan)లకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. వారి ప్రమాణస్వీకారానికి ఉన్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేశారు. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.

- Advertisement -

దీంతో గవర్నర్ నిర్ణయాన్ని వారు హైకోర్టు(TS High Court)లో సవాల్ చేయగా.. తాజాగా విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయకుండా యథాతథ స్థితి కొనసాగిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో అప్పటివరకు వారు ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం లేకుండా పోయింది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కోదండరామ్‌(Kodanda Ram)కు విద్యాశాఖ మంత్రిగా నియమించనున్నారని తెలుస్తోంది.

Read Also: యూపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి!!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...