స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ప్రకటించగా, తెలంగాణకు అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో 16 అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ, రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయగా, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయా పట్టణాల ఛైర్మెన్లు, ఛైర్‌పర్సన్లు అవార్డులను అందుకున్నారు. తెలంగాణాకు అవార్డులు రావటంతో మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేందుకు కృషి చేసిన అధికారులకు, సహకరించిన ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో సైతం హైదరాబాద్ 26 స్థానంలో నిలిచింది. గతేడాది 37వ స్థానంలో ఉండేది. టాప్ 100 పట్టణ స్థానిక సంస్థల తాజా జాబితాలో హైదరాబాద్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.