Traffic Rules: రూల్స్‌ పాటించకుంటే.. ఇక అంతే!

-

Hyderabad Traffic Rules fines Changed: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే మహానగరంలో దూరాన్ని కిలోమీటర్లలలో కాకుండా.. టైమ్‌లలో చెప్తారు. ఉదాహరణకు ఎల్బీ నగర్‌ నుంచి ఖైరతాబాద్‌కు వెళ్లాలంటే ఎన్ని కిలో మీటర్లు అని కాకుండా.. ఎంత టైమ్‌ పడుతుందో చెప్తుంటారు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.. హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ ఎలా ఉంటుందని. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా కొందరు ఉంటే, మరి కొందరు అడ్డదిడ్డంగా, రోడ్డు పైకి వచ్చేసి, ట్రాఫిక్‌ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. అటువంటి వారిపై కొరడా ఝళిపిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు (Hyderabad Traffic Rules) మరింత కఠినతరం చేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. వాహనదారులు రాంగ్‌ రూట్‌లో ప్రయాణిస్తే రూ. 1700, ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ. 1200 జరిమానా విధించనున్నారు. ఈనెల 28 నుంచి రాంగ్‌ రూట్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...