గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులను కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థే ‘హైడ్రా(Hydra)’. గ్రేటర్ పరిదిలో ఆక్రమణలకు గురైన చెరువులు, వాగులు, కుంటలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. వాటిని రక్షిస్తోంది హైడ్రా. వటి పరిసరాల్లో జరిగిన ఆక్రమణలను తొలగిస్తూ కఠిన చర్యలు చేపడుతోంది.
హైడ్రా చేపడుతున్న చర్యలకు అమీన్‌పుర్‌లో అరుదైన పక్షులు కనిపించి ఫలితాన్ని కనబరిచాయి. ఈ క్రమంలో తాజాగా హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో తమ దృష్టికి వచ్చిన ఆక్రమణలను మాత్రమే తొలగిస్తూ వస్తున్న హైడ్రా తమ చర్యల్లో మరింత వేగం పెంచాలని నిశ్చియించుకుంది.
అందులో భాగంగానే ఇకపై ఆక్రమణలపై ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త ఆలోచనను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కూడా ఫిక్స్ అయింది. ఈ మేరకు 2025లో ప్రతి సోమవారం రోజున బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని హైడ్రా(Hydra) అధికారికంగా తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని, వాటి ఆక్రమణలను వీలైనంత త్వరగా తొలగించేలా చర్యలు చేపడతామని హైడ్రా వివరించింది.