పుట్టినరోజు వేడుకల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అవసరం లేదని, ముఖ్యమంత్రి పోస్టు మీదా ఆశలేదని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలను కంటికిరెప్పాలా కాపాడుకుంటానని తెలిపారు. ప్రస్తుతం పార్టీలో వర్గపోరులు ఏమీ లేవని, అన్నీ సర్దుకున్నాయని అన్నారు. అందరం కలిసిగట్టుగా పనిచేస్తున్నామని, నాలుగు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. తాను ఏరోజూ పదవుల కోసం ఆశపడలేదని.. పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి రాగానే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. జూన్ మాసంలో ప్రియాంక గాంధీ నల్గొండకు వస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) చెప్పారు. తన బర్త్ డే వేడుకలు బల ప్రదర్శనకు వేదిక కాదన్నారు.
Read Also: అలాంటి వారికే తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్
Follow us on: Google News, Koo, Twitter