KTR | కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్ప ఇంకేమున్నాయ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కష్టాలు తప్పట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ముస్లిం, హిందూ భాయ్ భాయ్ అన్న తరహాలో మెలిగారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అంతటా కూడా మత విధ్వేషాలు మొదలయ్యాయని అన్నారు. మొహబత్‌కి దుకాన్ అని మాటలు చెప్తూ.. మైనార్టీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతటా గంగాజమున తెహజీబ్ పాలన సాగిందని, ముస్లిం, హిందూ సోదరులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునేవారని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మత కల్లోలాలు, వివాదాలు, విద్వేషాలు విరసిల్లాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్‌ను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుర్లు విసిరారు. అంతేకాకుండా మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించడం సంతోషంగా ఉంది.

ఆ ఘనత కేసీఆర్‌దే

‘‘2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగుతాయని అనుమానాలు వ్యాప్తి చేశారు. కానీ కేసీఆర్ పదేళ్ల హయాంలో గంగా జమున తహజీబ్‌ ఫార్ములాను పాటించడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ మనిషిని, మనిషిగా మానవత్వంతో చూశారే తప్ప మత పరంగా, ఓట్ల పరంగా చూడలేదు. అన్ని మతాల వారికి మేలు చేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇచ్చారు.

అందరినీ కలుపుకుని పోతామని చాలా మంది చెబుతారు కానీ చేయరు. దానిని ఆచరణలో పెట్టిన ఏకైక సీఎం కేసీఆర్. ఆ ఘనత ఆయనకే చెందుతుంది. మన పిల్లలకు మంచి విద్య అందిస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని కేసీఆర్ గారు నమ్మారు. అందుకోసమే 200కి పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 1.4 లక్షల విద్యార్థుల కోసం ఏటా రూ.1.2 లక్షల ఖర్చు చేస్తున్నారు’’ అని చెప్పారు.

మంచి విద్యే ఆయన లక్ష్యం

‘‘మైనార్టీలకు మంచి విద్య అందించేందుకు కేసీఆర్(KCR) ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు. మైనార్టీ గురుకుల స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుతున్నారు, ఇది రాష్ట్ర గర్వకారణం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో 2,751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షలు అందజేశారు. దాదాపు రూ.438 కోట్లు ఖర్చు చేశారు. నాంపల్లిలో 100 కోట్ల రూపాయల విలువ గల 2 ఎకరాల భూమి కేటాయించి, రూ. 40 కోట్లతో అనిసిల్ గుర్బా నిర్మించారు’’ అని KTR గుర్తు చేశారు.

మసీదుకు రూ.9కోట్లు

‘‘మక్కా మసీదు మరమ్మతులకు రూ. 9 కోట్లు ఖర్చు చేశారు. ఇస్లామిక్ సెంటర్ కోసం రూ. 40 కోట్లతో కోకాపేటలో సెంటర్ ఏర్పాటు చేశారు. రూ. 10 వేల కోట్లతో మైనార్టీ సంక్షేమం కోసం దేశంలో ఎవరూ ఖర్చు చేయని విధంగా కేసీఆర్ చేశారు. షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష ఇచ్చారు. ఇమామ్, మౌలనాలకు రూ. 5 వేల నగదు నెలకు అందించారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మైనార్టీకి డిప్యూటీ సీఎం‌గా నియమించారు. హైదరాబాద్‌లో డిప్యూటీ మేయర్ పదవిని కూడా ముస్లింలకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రేమ దుకాణం(మొహబత్‌కా దుకాన్) అంటారు, కానీ విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు’’ అని KTR ధ్వజమెత్తారు.

అన్నీ గాలి గ్యారెంటీలే

‘‘కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి, వాటిని వదిలేశారు. మూసీ పేరుతో 16 వేల పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలానా ఆజాద్ పేరుతో ‘తోఫా ఏ తలీమ్’ అన్నారు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. పీహెచ్ డీ, పీజీ చేసిన వారికి రూ. 5 లక్షలు అన్నారు, కానీ ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. ఇమాములకు, మౌలనాలకు రూ. 12 వేల వేతనం ఇస్తామన్నారు. ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి కూడా రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. షాదీ ముబారక్‌లో రూ. 1.05 లక్షలు, తులం బంగారం ఇస్తామన్నారు. వాగ్దానాలు చేసి, మీ ఓట్లు సొంతం చేసుకొని గద్దెనెక్కారు. మెహబ్బత్ దుకాణం అంటారు, కానీ విద్వేషాల రాజకీయాలు చేస్తున్నారు.

కేసీఆర్ హయాంలో ఒక్క క్షణం కూడా కర్ఫ్యూ విధించాల్సిన అవసరం రాలేదు. కానీ ఈ ప్రభుత్వం దసరా, దీపావళి సమయంలో నెల మొత్తం కర్ఫ్యూ విధించింది. అందుకే కేసీఆర్ ఎక్కడ, ఈ చిచోరా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ? వరంగల్‌కు వెళ్తే, అక్కడ ప్రజలు ఇంకా ఈ ప్రభుత్వాన్ని భరించాలా అని బాధపడుతున్నారు. కేసీఆర్ అందరి సంక్షేమం కోసం పనిచేశారు. మీరూ మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది’’ అని KTR వెల్లడించారు.

Read Also: కాంగ్రెస్ వచ్చాకే నేతన్నలకు కష్టాలు మొదలయ్యాయి: కేటీఆర్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...