మరికొన్ని నిమిషాల్లో ట్యాంక్ బండ్ వద్ద అద్భుత ఆవిష్కరణ జరగనుంది. ట్యాంక్ బండ్ కు సరికొత్త హంగులు జతకానున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఇండియాలోనే లార్జెస్ట్ మ్యూజికల్ ఫౌంటెయిన్ లాంచ్ కాబోతుంది. NTR మార్గ్ రోడ్ సైడ్ 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫాంటెయిన్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.17 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్టు ఇదివరకే HMDA ప్రకటించిన సంగతి తెలిసిందే.