CM KCR – MLC Kavitha | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(CM KCR) తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్(Gajwel) నుంచి మాత్రమే పోటీ చేస్తే ఓటమి పాలవుతారనే భయమే కారణమంటూ విపక్షాలు చేసే విమర్శలు ఎలా ఉన్నా కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగాలనే ఆలోచన వెనక పక్కా వ్యూహం ఉన్నదనేది గులాబీ వర్గాల మాట. రెండు చోట్లా గెలుపు ఖాయమనే ధీమాను బీఆర్ఎస్ నేతలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కానీ కామారెడ్డి(Kamareddy) నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడం చాలా మందికి మింగుడుపడలేదు. గెలిచిన తర్వాత ఆ స్థానాన్ని వదులుకుంటారని, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలో కవిత(MLC Kavitha)ను అభ్యర్థిగా ప్రకటిస్తారని, దాంతో ఆమె గెలుపునకు గ్రౌండ్ క్లియర్‌గా ఉంటుందనేది మరికొద్దిమంది మాట.