IT Raids on Minister Mallareddy Complaint at Highcourt: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు మెడికల్ కాలేజీలు, ఆఫీసుల్లో, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా ఐటీ సోదాలు ముగిశాయి. ఈ దాడుల్లో ఐటీ అధికారులు సుమారు 18.5కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాక.. 15కిలోల బంగారు ఆభరణాలను అధికారులు కనుగొన్నాట్లు సమాచారం. దీంతో మంత్రి మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే.. నోటీసులు వచ్చిన అందరు సోమవారం నుంచి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఐటీ సోదాలపై మల్లారెడ్డి (IT Raids on Minister Mallareddy)ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని.. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఐటీ అధికారులు తమపై దౌర్జన్యం చేయడంతో పాటు, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారన్నారు. ఈవిషయమై ఆయన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో ఈ కేసుపై ఐటీ అధికారులు కోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మల్లారెడ్డి తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరారు. కాగా వారి పిటిషను స్వీకరించింది.