ఖమ్మం(Khammam) నగరాన్ని మరో పర్యాటక ప్రాంతంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆయన మనవడు, గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. పండుగ వాతావరణంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరం వైభవంగా జరుపుతామని పువ్వాడ తెలిపారు. ప్రపంచంలోని తెలుగు వారందరూ ఒక్కసారైన ఆ మహానియుడి విగ్రహాన్ని చూసి తరించేలా విగ్రహం రూపకల్పన చేశామన్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో తీర్చిదిద్దిన విగ్రహం తయారీ ఇప్పటికే పూర్తి అయిందని పేర్కొన్నారు.
- Advertisement -
Read Also: ‘చంద్రబాబు కృషి వల్లే ఆ ఫలితాలు చేతికందుతున్నాయి’
Follow us on: Google News, Koo, Twitter