Jupally Krishna Rao | ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు: జూపల్లి

-

ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో జూపల్లి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతమే తన లక్ష్యమన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తానేక్కడా చూడలేదని విమర్శించారు. ఒక ఫాసిస్ట్‌గా రాష్ట్రాన్ని ఏలుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్‌లో ఏ వర్గానికి కూడా న్యాయం జరుగలేదని అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రజల్ని మభ్యపెట్టి నియంతలా పాలిస్తున్నాడని అన్నారు. అన్ని వర్గాలను ఎన్నికలకు వాడుకుంటున్నాడని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో జరిగిన అవినీతి గతంలో ఎన్నడూ జరుగలేదని అన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయాడని జూపల్లి(Jupally Krishna Rao) మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతులను మభ్య పెట్టేందుకు రుణమాఫీ, ఆర్టీసీ కార్మికులను లొంగదీసుకునేందుకు ప్రభుత్వంలో విలీనం అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడని అన్నారు. ప్రజలు అన్ని గమనించాలని కోరారు.

Read Also: BRS అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైంది: KTR
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...