కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. 400 ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత విభాగాలను పునర్‌వ్యవస్థీకరించింది. పార్టీ అనుబంధ సంస్థలైన యువజన, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా నియమించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay)కు కీలక బాధ్యతలు అప్పగించింది. కిసాన్ మోర్చా ఇంఛార్జిగా సంజయ్‌ను నియమించింది.
అలాగే యువమోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్లను ప్రకటించారు. కాగా గతేడాది జులైలో చివరిసారిగా బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను పునర్‌వ్యవస్థీకరించింది.