BRS MP Candidates | ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్

-

BRS MP Candidates | పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ముందుగా తొలి దశలో కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత పేర్లను ఖరారు చేశారు. గత రెండు రోజులుగా తెలంగాణ భవన్‌లో ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్‌ చర్చించారు. చర్చల అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

BRS MP Candidates | ఈనెల 12న కరీంనగర్‌లో సభ నిర్వహిస్తామని.. ఖమ్మంలో కూడా సభ ఉంటుందని నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని.. అప్పుడే వారి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని.. రాబోయే కాలం మనదేంటూ నేతలకు భరోసా కల్పించారు.

Read Also: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...